తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

top news
top news

By

Published : Dec 28, 2021, 6:02 AM IST

Updated : Dec 28, 2021, 10:01 PM IST

21:55 December 28

టాప్​న్యూస్​@10 PM

  • రేపు నల్గొండకు కేసీఆర్​..

CM KCR Nalgonda Visit: సీఎం కేసీఆర్​ రేపు నల్గొండకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ తండ్రి దశదిశకర్మ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

  • 'తొలిడోసు వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి'

Telangana Vaccination : రాష్ట్రంలో 15 నుంచి 18 వయసుల వారికి జనవరి 3 నుంచి కొవిడ్ టీకా అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. తెలంగాణలో మొదటి డోసు టీకా పంపిణీ వంద శాతం పూర్తయిన సందర్భంగా ఆయన వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద వల్లనే ఈ ఘనత సాధ్యమైందన్న ఆయన... కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా దేశంలోని ఏ ఒక్క పెద్ద రాష్ట్రం ఈ ఘనత సాధించలేదన్నారు. వైద్య సిబ్బందిన నిర్విరామ కృషికి ఇది నిదర్శనమన్నారు.

  • తల్లిపై అత్యాచారయత్నం.. మామను గొడ్డలితో నరికి చంపిన బాలికలు!

Minor Girls Kills Old Man Kerala: తమ తల్లిపై అత్యాచారం చేసేందుకు యత్నించిన మామపై గొడ్డలితో దాడి చేశారు ఇద్దరు బాలికలు. ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

  • 'రాజమౌళితో పని చేయడం సవాల్..'

NTR about Rajamoli: దర్శకుడు రాజమౌళితో పనిచేయం ఓ సవాల్​ లాంటిదని చెప్పారు హీరో ఎన్టీఆర్​. 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలో తాను ఎంతో అవగాహనతో నటించినట్లు తెలిపారు. కాగా, ఈ సినిమా తర్వాత మల్టీస్టారర్​ చిత్రాల జోరు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • హోం లోన్​ ఈఎంఐ చెల్లించకపోతే?

Home Loan: గృహ రుణం తీసుకొని నెల‌వారీ ఈఎంఐ చెల్లింపులు స‌క్ర‌మంగా చేసినంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. కానీ దీర్ఘ‌కాలంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈఎంఐ చెల్లింపులు చేయ‌లేక‌పోయినా, ఆల‌స్యమైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి ఎలా ఉంటాయంటే..?

20:55 December 28

టాప్​న్యూస్​@ 9PM

  • రాష్ట్రంలో 62కు చేరిన ఒమిక్రాన్ కేసులు

Telangana Omicron Cases: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 7 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62కు చేరుకుంది. ఈ 62 మంది ఒమిక్రాన్‌ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోకపోవటం కొసమెరుపు.

  • కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది'

jal shakti ministry meeting: తెలంగాణకు నీటి వాటాల కేటాయింపుల కోసం అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం మూడో సెక్షన్ కింద ట్రైబ్యునల్​కు నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కేంద్రాన్ని కోరింది.

  • 'అత్యవసర సేవల బంద్​' ఉపసంహరణ

Resident doctors protest: తమపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా బుధవారం అత్యవసర సేవల బంద్​కు పిలుపునిచ్చిన ఎయిమ్స్​ రెసిడెంట్ డాక్టర్లు.. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. నీట్ పీజీ-2021 కన్సిలింగ్​ను వీలైనంత త్వరగా నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవీయ వారికి హామీ ఇచ్చారు. అయితే నిరసనలు కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై రాత్రి సమావేశమై నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

  • శార్దూల్​పై అశ్విన్ ప్రశంసలు..

Ashwin praises Shardul: టీమ్ఇండియా ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్​పై ప్రశంసల జల్లు కురిపించాడు సీనియర్ స్పిన్నర్ రవి అశ్విన్. భారత బ్యాటర్ల బ్యాటింగ్​లోని లోపాలను అతడు ఎత్తిచూపాడని కొనియాడాడు.

  • ఐటీ రిటర్న్‌ల గడువు పెంచండి..!

Taxpayer Complaints: ఐటీ రిటర్న్‌లకు గడువు పెంచాలని పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఐటీ పోర్టల్‌ సమస్యల తలెతుతున్న నేపథ్యంలో గడువు పొడిగించాలని ట్విట్టర్​లో ట్రెండింగ్​లోకి వచ్చింది.

19:50 December 28

టాప్​న్యూస్​@8PM

  • 'కాఫీ కన్న పుస్తకాలు ఎక్కువ కిక్ ఇస్తాయి'

CJI NV Ramana about books: 34వ హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ప్రదర్శనశాలలో యువతరం రావటాన్ని చూసి ఆనందం వ్యక్తం చేసిన సీజేఐ.. తాను చదువుకునే రోజులను గుర్తుచేసుకున్నారు. ప్రపంచ గతిని మార్చిన సాహిత్యాన్ని పిల్లలకు చిన్నతనం నుంచే పరిచయం చేయాలన్నారు. కాఫీ కన్న పుస్తకాలు ఎక్కువ కిక్ ఇస్తాయన్న సీజేఐ.. పుస్తకాలు బహుమతులుగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.

  • మరో 7 ఒమిక్రాన్ కేసులు నమోదు

Telangana Omicron Cases: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 7 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62కు చేరుకుంది. ఈ 62 మంది ఒమిక్రాన్‌ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోకపోవటం కొసమెరుపు.

  • సర్​ప్రైజ్​లతో 'భీమ్లానాయక్'​, 'లైగర్'​ సిద్ధం

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'లైగర్'​, 'భీమ్లానాయక్'​, 'ఒకే ఒక జీవితం', 'ఖిలాడి' సహా పలు చిత్రాల సంగతులు ఉన్నాయి.

  • క్రికెట్​లో అరుదైన ఫీట్లు..

Cricket rewind 2021: క్రికెట్​లో హ్యాట్రిక్ వికెట్లు సాధించడమనేది అరుదుగా జరిగే విషయం. అలాగే హిట్ వికెట్ అవడం కూడా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎవరెవరు హ్యాట్రిక్ వికెట్లు తీశారో, ఎంతమంది హిట్ వికెట్​గా వెనుదిరిగారో చూద్దామా!

  • ఐపీఓ రూల్స్​ కఠినతరం

SEBI IPO New Rules: పబ్లిక్​​ ఇష్యూ, ట్రేడింగ్​ సహా పలు నిబంధనల్లో మార్పులు చేసింది మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ. మదుపరులు, సంస్థల నష్టాలను నివారించేందుకు ఈ సవరణలు చేపట్టినట్లు సెబీ పేర్కొంది.

18:52 December 28

టాప్​న్యూస్​@7PM

  • 'తొలిడోసు వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి'

Telangana Vaccination : తొలి డోసు వంద శాతం లక్ష్యం పూర్తి చేసుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తయిందని ప్రశంసించారు. ప్రజల్లో ఉండే అనుమానాలు, అపోహలు నివృత్తి చేశామన్నారు.

  • 'ప్రికాషన్​ డోసు కోసం..'

Precaution Dose: 60ఏళ్ల వయసుదాటి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి జనవరి 10 నుంచి భారత్​లో ప్రికాషన్​ డోసు అందించనున్నారు. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నాయనే ధ్రువీకరణ పత్రం లేకున్నా టీకా వేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత మూడో డోసు తీసుకోవాలని వెల్లడించింది.

  • ఈడీ కొరడా.. రూ.294కోట్ల ఆస్తులు జప్తు

MGM Maran Assets Seize: తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు లిమిటెడ్ మాజీ ఛైర్మన్ ఎంజీఎం మారన్​కు చెందిన రూ. 293.91 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేసింది ఈడీ. ఈ ఆస్తులు నాలుగు భారతీయ కంపెనీల్లో షేర్ల రూపంలో ఉన్నాయని పేర్కొంది.

  • గాయంతో మైదానాన్ని వీడిన బుమ్రా

Bumrah Injury: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా స్టార్ పేసర్ బుమ్రాకు గాయమైంది. దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడాడు.

  • నడవలేదన్నారు.. కానీ మోడల్​గా దూసుకెళ్తోంది!

ఫెమినా మిస్​ ఇండియాగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అంకితా షోరే. బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని కెరీర్​లో ముందుకు సాగుతోంది.

18:05 December 28

టాప్​న్యూస్​@6 PM

  • మద్యం విక్రయ వేళలు పొడిగింపు

కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలను ప్రభుత్వం పొడిగించింది. 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.

  • మోదీ భద్రతకు రూ.12కోట్ల ​కారు

PM Modi new car: ప్రధాని నరేంద్ర మోదీ భద్రతకు రూ.12కోట్ల ఖరీదైన 'మెర్సిడీస్‌-మేబాక్​ ఎస్‌-650 గార్డ్‌'ను వినియోగిస్తున్నారు. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు. ఆ తర్వాత ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ హైసెక్యూరిటీ ఎడిషన్‌‌, రేంజ్​రోవర్‌ వోగ్‌, టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ను వినియోగించారు.

  • క్యాంపస్​లో మళ్లీ ఉద్రిక్తత!

Delhi Doctors Protest: రెసిడెంట్ డాక్టర్ల ర్యాలీపై పోలీసుల దాడులను నిరసిస్తూ దిల్లీ ఎయిమ్స్​లో వైద్యులు ఆందోళన చేపట్టారు. ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమవగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైద్యులు నిరసనల్లో పాల్గొనగా.. ఆస్పత్రుల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • కార్లలో కరోనా పరీక్షలు

అమెరికాలో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయికి చేరింది. కొవిడ్​ కేసులు రోజుకు రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. ఫ్లోరిడాలోని మియామి నగర ప్రజలు వాహనాల్లోనే ఉండి ఆస్పత్రుల వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఫలితంగా కిలోమీటర్లు మేర కార్లు క్యూ​ ఏర్పడింది.

  • ఎవరితోనైనా గొడవ పడితే..

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తనపై వస్తున్న ట్రోల్స్​పై స్పందించారు. దీంతో పాట ఎవరితోనైనా గొడప పడితే ఏం చేస్తారు?, సాంగ్స్ కాపీ కొట్టడం సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు.

16:52 December 28

టాప్​న్యూస్​@5 PM

  • 29 ఏళ్లు పాక్​ జైల్లో మగ్గి..

JK Man Returns to India: పాకిస్థాన్​లోని ఓ జైల్లో 29 సంవత్సరాలు చిత్రహింసలు అనుభవించాడు ఓ భారతీయుడు. ఎట్టకేలకు ఇప్పుడు స్వదేశానికి తిరిగివచ్చిన అతనికి జమ్ముకశ్మీర్​ కథువాలోని తన స్వగ్రామంలో ఘనస్వాగతం లభించింది. ఇన్నేళ్లు అక్కడ తను పడ్డ కష్టాలను వివరించాడు.

  • థియేటర్ల మూసివేతపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

closure of theatres in ap: ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం, థియేటర్ల మూసివేతపై ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తరఫున కమిటీ చేశామని చెప్పారు. ఆ నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. హీరో నాని, సిద్దార్థ్ వ్యాఖ్యలపైనా స్పందించారు. తనిఖీల భయంతోనే థియేటర్లు మూసేస్తున్నారని చెప్పారు.

  • కన్నీరు పెట్టుకున్న బన్నీ, సుకుమార్​​

Alluarjun cried: 'పుష్'ప థ్యాంక్స్ ​మీట్​లో ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్​.. దర్శకుడు సుకుమార్​తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ​ కంటతడి పెట్టారు. బన్నీ మాటలతో సుకుమార్​ కూడా ఉద్వేగానికి లోనయ్యారు.

  • ఇర్ఫాన్ పఠాన్​కు పుత్రోత్సాహం..

Irfan Pathan son: టీమ్ఇండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ భార్య సఫా పండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇర్ఫాన్ సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశాడు.

  • బుల్​ జోరు

Stock Market Closing: అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండోరోజు స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 477 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో.. 17,233 వద్ద స్థిరపడింది.

15:42 December 28

టాప్​న్యూస్​@4 PM

  • కేంద్ర జలశక్తి శాఖ కీలక భేటీ

jal shakti ministry meeting: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ అయ్యింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు, సమస్యలపై చర్చించనున్నారు.

  • మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానాలు

Basti Dawakhana in Municipality:పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ఇతర పట్టణాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

  • 'యూపీ అభివృద్ధిపై ధ్యాసే లేదు'

PM Modi kanpur visit: ఉత్తర్​ప్రదేశ్​లో గత పాలకులకు అభివృద్ధి పట్ల ధ్యాసే లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. భాజపా అధికారంలోకి వచ్చాక ఎన్నో ప్రాజెక్టులను చేపట్టినట్లు చెప్పారు. కాన్పుర్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మెట్రో రైలులో ప్రయాణించారు.

  • భారత్ 327 ఆలౌట్

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 327 పరుగులకు ఆలౌటైంది టీమ్ఇండియా. తొలి రోజు సెంచరీతో సత్తాచాటిన రాహుల్.. మూడో రోజు మరో పరుగు జోడించి వెనుదిరిగాడు. అనంతంర ఎవ్వరూ ఆకట్టుకోలేకపోయారు.

  • ఇంత దారుణంగా ఓడిపోవడం..

Root on Boxing day Test loss: ఆస్ట్రేలియాలో యాషెస్‌ సిరీస్‌ కోల్పోవడం పట్ల ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ తీవ్ర నిరాశకు గురైనట్లు చెప్పాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్‌ డే టెస్టు రెండున్నర రోజుల్లోనే పూర్తయ్యింది. మ్యాచ్‌ అనంతరం రూట్‌ మీడియాతో మాట్లాడాడు.

14:37 December 28

టాప్​న్యూస్​@3PM

  • రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరణ

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరించనుంది. మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.

  • ఒమిక్రాన్​ కట్టడికి మరిన్ని ఆంక్షలు.. పాఠశాలలు బంద్​!

Covid restrictions in India: ఒమిక్రాన్​ వ్యాప్తితో రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి. ఇప్పటికే అనే రాష్ట్రాలు నైట్​ కర్ఫ్యూను విధించాయి. తాజాగా ఒమిక్రాన్​ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్టు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఎల్లో అలర్ట్​ జారీ చేశారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.

  • ఐసొలేషన్, క్వారంటైన్​​ లెక్కలు మారాయ్..

Isolation quarantine covid rules: క్వారంటైన్​.. ఐసొలేషన్​.. కొవిడ్​ మహమ్మారి పుట్టినప్పటి నుంచి వింటున్న మాటలు ఇవి. వీటి నిబంధనల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అధికారులు మరికొన్ని మార్పులు చేశారు. కొవిడ్​ బాధితులు, వారికి సన్నిహితంగా ఉన్న ప్రజలు వాటిని కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే..

  • సూర్యకుమార్​ మంచి మనసు..

Surya Kumar Yadav Donation: టీమ్​ఇండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. ఓ లోకల్​ టోర్నమెంట్​లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అత్యధిక పరుగులు చేసి 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్' సొంతం చేసుకున్నాడు. అనంతరం ఈ అవార్డును గ్రౌండ్స్​మెన్​కు డొనేట్ చేశాడు.

  • మోహన్​ బాబు ఇల్లు చూస్తే షాకవుతారు!

Mohan Babu home tour: సీనియర్​ నటుడు మోహన్​ బాబు ఇంటిని నెటిజన్లకు పరిచయం చేశారు నటి మంచు లక్ష్మి. హైదరాబాద్‌లో ఉన్న ఈ ఇంటిపై ఆమె హోం టూర్ వీడియో చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

13:53 December 28

టాప్​ న్యూస్​ @2PM

  • చిన్నారి గుండెకు అరుదైన ఆపరేషన్

Baby Heart Surgery: ముంబయిలోని జేజే ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. గుండెకు చిల్లు పడి ఇబ్బంది పడుతున్న రెండు నెలల చిన్నారికి ఓపెన్​ హార్ట్​ సర్జరీ చేయకుండానే పూడ్చారు. ఇలా చేయడం దేశంలో తొలిసారి అని వైద్యులు తెలిపారు.

  • దేశ వారసత్వాన్ని చెరిపేందుకు కుట్ర

congress foundation day: బలమైన భారత్‌ను అభివృద్ధి చేసేందుకు ఏళ్ల తరబడి పార్టీ నేతలు వేసిన దృఢమైన పునాదిని బలహీనపరిచేందుకు కొన్ని విద్వేషపూరిత సిద్ధాంతాలు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం.. భాజపాను పరోక్షంగా విమర్శించారు.

  • భాజపా అంటే స్కామ్​ల పార్టీ

MLA Jeevan reddy on BJP and congress : కాంగ్రెస్‌, భాజపాపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపణలు చేశారు. ఇటీవల అన్ని ఎన్నికల్లోనూ ఆ విషయం నిరూపితమైందని అన్నారు.

  • ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Gouravelli project expats protest : హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పినా... ఆందోళన విరమించేది లేదని నిర్వాసితులు తేల్చిచెప్పారు.

  • మరో మూడేళ్లు క్రికెట్ ఆడతా

12:39 December 28

టాప్​ న్యూస్​ @1PM

  • మరో రెండు వ్యాక్సిన్లకు అనుమతి

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (పుణె) తయారుచేసిన 'కొవొవాక్స్‌', బయోలాజికల్‌-ఈ తయారు చేసిన కార్బెవాక్స్‌ అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చింది సీడీఎస్​సీఓ(కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ). మోల్నుపిరవిర్ డ్రగ్​కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ తెలిపారు.

  • పూర్వవైభవం రావాలంటే కాంగ్రెస్ రావాలి

Congress Party 137th Foundation Day: కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హైదరాబాద్ గాంధీభవన్​లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • రూట్​ అరుదైన ఫీట్

Joe Root Record: యాషెస్​ సిరీస్​లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టుతో ఇంగ్లాండ్​ కెప్టెన్ జో రూట్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్​ ఇయర్​లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

  • కిమ్​ అధ్యక్షతన కీలక సమావేశం

Kim key meeting North Korea: వివిధ ప్రాజెక్టులను సమీక్షించడం, నూతన విధానాలతో పాటు అమెరికాతో నెలకొన్న ప్రతిష్ఠంభనపై చర్చించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఇదే వేదికపై గతంలో కిమ్​ పలు కీలక ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • హిందీ సినిమాలూ అందుకోలేకపోతున్నాయి

Pushpa Movie: హిందీలో విడుదలైన 'పుష్ప' బాలీవుడ్​ సినిమాల కన్నా అధికంగా కలెక్షన్స్​ రాబడుతోందని చెప్పారు నిర్మాత కరణ్ జోహర్. బన్నీ స్టార్​డమ్​ వల్లే సినిమాకు భారీ ఓపెనింగ్స్​ వచ్చాయని అన్నారు.

11:44 December 28

టాప్​ న్యూస్​ @12PM

  • సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో సినిమా టికెట్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • విక్రమ్​ మిశ్రికి డిప్యూటీ ఎన్​ఎస్​ఏ బాధ్యతలు

Vikram Misri deputy NSA: భారత ప్రభుత్వానికి విస్తృత సేవలందించిన విక్రమ్​ మిశ్రి.. డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 1989 ఐఎఫ్​ఎస్​ బ్యాచ్​ సభ్యుడైన మిశ్రి.. 2019 నుంచి ఇప్పటివరకు చైనాకు భారత రాయబారిగా విధులు నిర్వహించారు.

  • పర్యావరణహిత ఆవిష్కరణ.. ఈ త్రీ వీలర్

బీటెక్‌ అంటేనే.. సాధారణంగా నవీన ఆవిష్కరణలకు వేదిక. కానీ, దీనిని కూడా మార్కుల పోటీల్లో నిలపడంతో.. విద్యార్థులు సిల్క్స్‌కు ఆమడ దూరంలో నిలుస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అలా కాకుండా.. క్యాంపస్‌లో అడుగుపెట్టిన తొలి నుంచే ప్రాక్టీకల్‌ నాలెడ్జ్‌కు అధిక ప్రాధాన్యమిస్తే.. ఆవిష్కరణలు సులభంగా చేయవచ్చని నిరూపిస్తున్నారు.. ఓయూకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు.

  • ఆస్తి రాస్తేనే... అన్నం పెడుతానంది

Daughter attack on mother for assets : కన్న తల్లిని ఆస్తి కోసం హింసించింది ఓ కూతురు. 'ఆస్తి రాస్తేనే అన్నం పెడుతానంటూ... బిడ్డలతో కలిసి దాడి'కి దిగిందని ఆ వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. కడుపున పుట్టిన బిడ్డే దాడి చేస్తే.. చేసేదిలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది.

  • సల్మాన్-షారుక్ సినిమా.. ఎప్పుడంటే?

salman khan shahrukh khan movie: బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ 'పఠాన్' సినిమాలో నటించబోతున్నట్లు స్పష్టంచేశారు స్టార్​ హీరో సల్మాన్ ఖాన్. భవిష్యత్తులో తాము కలిసి సినిమా చేసే అవకాశముందని అన్నారు.

10:43 December 28

టాప్​ న్యూస్​ @11AM

  • గంగూలీకి కరోనా పాజిటివ్

టీమ్​ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ కొవిడ్ బారినపడ్డాడు. సోమవారం సాయంత్రం గంగూలీ ఆసుపత్రిలో చేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

భాగ్యనగరంలో ఆహా.. ఏమీ రుచి..

Different Types of Food in Hyderabad: 7 ఖండాలు.. 195 దేశాలు.. 10వేల నగరాలు.. ఒక్కో ప్రాంతానిదీ ఒక్కో ఆచార వ్యవహారం, ఆహారపు అలవాటు. ఇవన్నీ ఒకేచోట కనిపిస్తే.. అదే భాగ్యనగర ప్రత్యేకత. అన్ని రుచుల ఘుమఘుమలూ ఈ నగరానికి తెలుసు. అందుకే ఈ 400 ఏళ్ల చారిత్రక నగర ఆహారానికి యునెస్కో గుర్తింపు దక్కింది.

  • అత్యవసర సేవలు బంద్​

NEET-PG 2021 counselling: నీట్​- పీజీ 2021 కౌన్సిలింగ్​ ఆలస్యాన్ని నిరసిస్తూ.. దిల్లీలో రెసిడెంట్ వైద్యులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కొందరు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్​ చేసినట్లు డాక్టర్లు ఆరోపిస్తున్నారు.

  • బంగారం ధరలు ఇలా..

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

  • మరో రీమేక్​లో ఆమిర్​!

బాలీవుడ్​ స్టార్​ హీరో ఆమిర్​ ఖాన్ మరో రీమేక్ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యూటీ రష్మిక తన కొత్త చిత్రంలో అమాయకురాలి పాత్రలో అలరించనుందని సమాచారం.

09:59 December 28

టాప్​ న్యూస్​ @10AM

  • విద్యుదాఘాతం ఘటనలో మరొకరు మృతి

Isnapur family electrocuted incident : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు మృత్యువాత పడ్డారు. చికిత్స పొందుతూ మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

  • దేశంలో మరో 6,358 కరోనా కేసులు

India covid cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 6,358 కేసులు వెలుగుచూశాయి. మరో 293 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,450 మంది కోలుకున్నారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు పెరిగింది.

  • సానుకూలంగా ఆర్థిక షేర్లు- లాభాల్లో మార్కెట్లు

stock market live updates: అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల మధ్య దేశీయ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 346 పాయింట్ల లాభంతో 57,766 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 100 పాయింట్లు మెరుగుపడి 17,186 వద్ద కొనసాగుతోంది.

  • అరంగేట్ర మ్యాచ్​లోనే అద్భుతం

Debut Cricketers of Teamindia 2021: శ్రేయస్​ అయ్యర్​, అక్షర్​ పటేల్​, ఇషాన్​ కిషన్​, ప్రసిద్ధ్​ కృష్ణ సహా పలువురు ఆటగాళ్లు ఈ ఏడాది వివిధ ఫార్మాట్​లలో టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేశారు. తమ తొలి ఇన్నింగ్స్​లోనే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించి తామేంటో నిరూపించుకున్నారు. ఓ సారి వారి ప్రదర్శనను నెమరువేసుకుందాం..

  • హ్యాట్రిక్​ హిట్​ కొట్టారు!

Hat trick Hit Movies 2021: చిత్రసీమలో హీరోహీరోయిన్ల కాంబోలకే కాదు డైరెక్టర్​-హీరో కాంబినేషన్స్​కు కూడా ఫ్యాన్స్​ ఉంటారు. ఎందుకంటే వారి కలయికలో వచ్చిన చిత్రాలు గొప్పగా ఆకట్టుకుంటాయని వారి నమ్మకం. ఆ స్టార్ కాంబో కలిసి మరో సినిమా చేస్తున్నారంటేనే అంచానాలు కూడా తారస్థాయిలో ఉంటాయి. కాగా, ఈ ఏడాది పూర్తయిపోతున్న నేపథ్యంలో 2021లో సినీప్రియుల ముందుకు వచ్చి హ్యాట్రిక్​ హిట్​ అందుకున్న సూపర్​ కాంబోలు ఏవో చూసేద్దాం.

09:02 December 28

టాప్​ న్యూస్​ @9AM

  • లారీని ఢీకొట్టిన కారు

Himayat Sagar Accident Today : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు.. హిమాయత్​సాగర్​ వద్ద ఔటర్ రింగ్​రోడ్​పై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

  • పబ్బుల్లో మొదలైన సంబురం

Hyderabad Pubs : ఓవైపు కరోనా మూడో ముప్పు.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని సర్కార్ సూచిస్తోంది. అయినా పబ్​ల యాజమాన్యాలు మాత్రం ఈ సూచనలు పెడచెవిన పెట్టి న్యూ ఇయర్ వేడుకలను అప్పుడే మొదలుపెట్టాయి. పరిమితికి మించి లోపలికి అనుమతించడం.. పబ్​లో కరోనా నిబంధనలను గాలికొదిలేయడం.. అర్ధరాత్రి వరకు పబ్​ నిర్వహించడం.. ఇలా నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు.

  • ఒమిక్రాన్ నేపథ్యంలో ఆంక్షలు

New Year Celebrations 2022: వేరియంట్లు..వేవ్‌లు..! రెండేళ్లుగా వీటితోనే పోరాటం చేస్తోంది ప్రపంచం. శాస్త్రవేత్తలు శ్రమించి టీకాలు తెచ్చినా... వైరస్ రూపం మార్చుకుంటూ దాడి చేస్తూనే ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మరోసారి అలజడి సృష్టిస్తోంది. రానున్న పండుగల నేపథ్యంలో ఒమిక్రాన్ విస్తరించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు అమల్లోకి రాగా.. హైదరాబాద్​లోనూ జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

  • 'మాస్కు' మహత్తు తెలుసుకోండి

ఒమిక్రాన్‌ రకం వైరస్‌ విజృంభణతో మాస్కు ప్రాధాన్యం మరింత పెరిగింది. నిజానికి కొవిడ్‌ జబ్బు ఒమిక్రాన్‌తో సమసిపోయేది కాదు. మున్ముందు మరెన్నో రకాల కరోనా వైరస్‌లు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదు. అందువల్ల మాస్కు వేసుకోవడం మన జీవితంలో ఒక భాగం కావాలి. బయటికి వెళ్లినప్పుడు విధిగా మాస్కు పెట్టుకోవాలి.

  • నాగార్జునుడు నడయాడిన నేల

Buddhavanam in Nagarjuna Sagar :అది బౌద్ధ దార్శనికుడు, రెండో బుద్ధుడిగా పేరొందిన ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల. ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అని మారుమోగిన ప్రాంతం. ఆగ్నేయాసియాకు బౌద్ధాన్ని విస్తరింపజేసిన ముఖద్వారం. అంతటి విశిష్ట, చారిత్రక నేపథ్యమున్న ప్రాంతంలో చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

08:04 December 28

టాప్​ న్యూస్​ @ 8AM

  • ప్రత్యేక సర్వేకు కేటీఆర్‌ ఆదేశాలు

Special Survey in Municipalities: పురపాలికల్లో ప్రత్యేక సర్వే చేపట్టాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలపై నిర్మాణాలపై ప్రత్యేక సర్వే చేసి నిబంధనలు ఉల్లంఘించిన, అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు.

  • ఎవరూ నమ్మని ఏఓ హ్యూమ్‌

రుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు బ్రిటిష్‌ హయాంలో పనిచేసిన ఆంగ్లేయుల్లో కొంతమంది భారత అస్మదీయులూ ఉన్నారు. వారిలో మనం మరచిపోలేని పేరు అలెన్‌ ఓక్టావియన్‌ హ్యూమ్‌ (ఏఓ హ్యూమ్‌)! స్వాతంత్య్రోద్యమానికి పర్యాయపదమైన భారత జాతీయ కాంగ్రెస్‌ను భారతీయుల వెంటబడి మరీ స్థాపించిన సంస్కరణాభిలాషి మానవతావాది హ్యూమ్‌!

  • అత్యవసర వినియోగానికి సిఫార్సు

Covovax In India: సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (పుణె) తయారుచేసిన 'కొవొవాక్స్‌'కు, బయోలాజికల్‌-ఈ తయారు చేసిన కార్బెవాక్స్‌కు అనుమతులు మంజూరు చేయాలని.. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అమెరికాకు చెందిన నొవావాక్స్‌ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్‌ఐఐ కొవొవాక్స్‌ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది.

  • ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్

Ashes 2021: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘోరంగా విఫలమైంది. రెండో ఇన్నింగ్స్​లో 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో యాషెస్​ సిరీస్​ను సొంతం చేసుకుంది ఆసీస్.

  • తారక్‌, చరణ్‌ వేర్వేరు ధ్రువాలు

"చరణ్‌, తారక్‌.. ఓ స్థాయికి వెళ్లాలనుకుంటున్నారు.. కానీ, ఇద్దరి ప్రయాణం వేరు" అని చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. దక్షిణ ధ్రువం ఒకరైతే ఉత్తర ధ్రువం మరొకరని అన్నారు.

06:58 December 28

టాప్​ న్యూస్​ @ 7AM

  • ఆరోగ్య సూచీలో మూడో స్థానం

Health Index Telangana 2021 : ఆరోగ్య సూచీ(2019-20)లో తెలంగాణ గతేడాది కంటే మెరుగుపడింది. 2018-19లో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం 2019-20లో మూడో స్థానంలో నిలిచింది. 2018-19లో మూడో స్థానంలో ఉన్న ఏపీ 2019-20లో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రారంభం(2017) నుంచి ఈ సూచీలో కేరళ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

  • రాణి ఎలిజబెత్‌ హత్యకు యత్నం

Queen Elizabeth: బ్రిటన్​ రాణి ఎలిజబెత్​ను ఓ 19 ఏళ్ల యువకుడు హత్య చేసేందుకు ప్రయత్నించాడు. జలియన్​వాలా బాగ్​ మారణకాండకు ప్రతీకారంగా రాణిని హత్య చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

  • టాటా భవిష్యత్తు ప్రాధాన్యతలు అవే

Tata Chairman: కొత్త ఏడాదికి ముందు టాటా గ్రూప్‌లోని 8 లక్షలకు పైగా ఉద్యోగులకు సంస్థ ఛైర్మన్​ ఎన్​. చంద్రశేఖరన్​ సందేశమిచ్చారు. రాబోయే రోజుల్లో డిజిటల్‌, కొత్త ఇంధనాలు, సరఫరా వ్యవస్థ బలోపేతం, ఆరోగ్యం.. వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు.

  • రంజీ జట్టు సారథిగా తన్మయ్

Tanmay Agarwal Captain: రంజీ ట్రోఫీ 2021-22 సీజన్​ జనవరి 8 నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​ తుది జట్టును ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. తన్మయ్‌ అగర్వాల్‌ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.

  • ఓ ప్రేమ లేఖలా రాస్తున్నారు

రాహుల్​ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని నటించిన 'శ్యామ్​ సింగరాయ్'​ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. సినిమా... కావ్యంలా ఉందంటూ విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సక్సెస్​ మీట్​ పెట్టిన చిత్రబృందం సినిమా గురించిన ఆసక్తికర విశేషాలను పంచుకుంది.

02:26 December 28

టాప్​ న్యూస్​ @ 6AM

  • నేటి నుంచి యాసంగి రైతుబంధు

యాసంగి రైతుబంధు సాయం నేటి నుంచి రైతులకు అందనుంది. ఎకరా భూవిస్తీర్ణంలోపు ఉన్న వారి ఖాతాల్లో ఇవాళ నగదు జమకానుంది. రోజూ ఎకరా చొప్పున పెంచుకుంటూ ఆరోహణా క్రమంలో రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఈ సీజన్ రైతుబంధు సాయంతో... మొత్తం రైతుబంధు సాయం 50 వేల కోట్లను దాటనుంది.

  • కీలక భేటీ

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. నోటిఫికేషన్ అమలు విషయంలో అసంతృప్తిగా ఉన్న కేంద్ర జలశక్తి శాఖ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించనుంది.

  • ఓవైసీ, మిధాని కూడళ్లలో తీరనున్న ట్రాఫిక్‌ సమస్య

జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో ఓవైసీ, మిధాని జంక్షన్లలో... నిర్మాణమైన పైవంతెనను కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించనున్నారు. జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ పైవంతెన నిర్మాణాన్ని... 2018లో చేపట్టారు.

  • హీరో సాయిధరమ్ తేజ్​కు నోటీసులు

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి.. కోలుకున్న హీరో సాయిధరమ్​తేజ్​కు సైబరాబాద్​ పోలీసులు నోటీసులు జారీ చేశారు. డ్రైవింగ్​ లైసెన్స్​, ఆర్సీ, ఇన్సురెన్స్​ తదితర రికార్డులు ఇవ్వాలని 91 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసినట్లు సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్ర తెలిపారు.

  • శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల విడుదల

నేడు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తితిదే తెలిపింది. జనవరి, ఫిబ్రవరి కోటాను మధ్యాహ్నం 3 గం.కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

  • ఆ చిన్నారులకు అండగా పీఎం కేర్స్​

'పీఎం కేర్స్​ ఫర్​ చిల్​డ్రన్' ద్వారా మహమ్మారి కారణంగా అనాథులైన చిన్నారులకు సాయం అందించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 3481 దరఖాస్తులను ఆమోదించినట్లు పేర్కొంది.

  • రెసిడెంట్ డాక్టర్ల ఆందోళనలో ఉద్రిక్తత

నీట్- పీజీ 2021 కౌన్సిలింగ్​ ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. నిరసనలకు దిగిన వైద్యులను పోలీసులు నిర్భందించారు. డాక్టర్లపై దాడిని 'ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ఆసోసియోషన్​'(ఎఫ్ఓ​ఆర్​డీఏ) ఖండించింది.

  • తూటా పేలింది..

పెట్రోలో బంక్​ వద్ద ఉన్న దుకాణంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్​ రాష్ట్రంలో జరిగింది.

  • అఫ్గాన్​లో ఎన్నికల సంఘం రద్దు

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించి అక్కడి పౌరులపై అనేక ఆంక్షలు విధిస్తూ వచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు ఆ దేశంలో ఎన్నికలే లేకుండా చేయాలని భావిస్తున్నారు. అందుకే అక్కడి ఎన్నికల సంఘాన్ని తాలిబన్​ ప్రభుత్వం రద్దు చేసింది. తాలిబన్ల ప్రభుత్వంలో ఎన్నికల ప్రస్తావనే ఉండదు కాబట్టి.. వీటిని రద్దు చేసినట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • 'ప్రతి సీన్​ మళ్లీ చేసేందుకు రెడీ'

'ఆర్ఆర్ఆర్'.. చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్​ అంగరంగ వైభవంగా జరిగింది. ఈవేడుకలో హీరోలు రామ్​చరణ్, ఎన్టీఆర్.. ఒకరిపై మరొకరికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

Last Updated : Dec 28, 2021, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details