కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల్లోకి నామమాత్రంగానే నీటి ప్రవాహం ఉంది. అన్ని రిజర్వాయర్లు ఖాళీగానే ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆలమట్టిలోకి ఇప్పటివరకు 47 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. మరో 70 టీఎంసీలు వస్తే గానీ దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. గోదావరిలో పైనున్న జైక్వాడిలోకి ఇప్పటివరకు ఐదున్నర టీఎంసీలు మాత్రమే వచ్చాయి. అయితే ప్రాణహితలో కొంత ప్రవాహం ఉన్నందున త్వరలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది.
నెట్టెంపాడు నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభం
జూరాలకు వరద రాక పెరగడంతో నెట్టెంపాడు నుంచి నీటి ఎత్తిపోత మొదలైంది. ఎగువన కర్ణాటకలో వర్షాలతో జూరాలకు వరద పెరిగింది. శనివారం నెట్టెంపాడు లిఫ్ట్‌లను గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. సీఏం కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిని ఎత్తిపోస్తున్నామన్నారు.