తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇంటర్ సిలబస్‌లో 30 శాతం తొలగింపు

telangana-intermediate
telangana-intermediate

By

Published : Sep 22, 2020, 7:42 PM IST

Updated : Sep 22, 2020, 10:11 PM IST

19:39 September 22

ఇంటర్ సిలబస్‌లో 30 శాతం తొలగింపు

     ఇంటర్మీడియట్​లో తొలగించిన సిలబస్ ఈ విద్యా సంవత్సరంలో మాత్రమే అమల్లో ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల్లో 30 శాతం సిలబస్ కుదించినట్లు అధికారికంగా ప్రకటించిన ఇంటర్ బోర్డు.. తొలగించిన పాఠాలను వెబ్​సైట్​లో ఉంచింది. ఎంపీసీ, బైపీసీ వంటి సైన్స్ గ్రూపులకు సీబీఎస్ఈ తొలగించిన పాఠాలనే కుదించినట్లు పేర్కొంది. సీఈసీ వంటి ఆర్ట్స్ గ్రూపులకు మాత్రం సబ్జెక్టు నిపుణులు సిఫార్సు చేసిన పాఠాలను తొలగించినట్లు జలీల్ వివరించారు.  

ఆ సిలబస్​ నుంచే ప్రశ్నలు

     వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న వార్షిక, ఆ తర్వాత జరిగే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో... 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వనున్నట్లు జలీల్​ స్పష్టం చేశారు. కరోనా పరిస్థితుల్లో జీరో సంవత్సరం చేయకుండా.. సీబీఎస్ఈ చేపట్టిన ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు సిలబస్ కుదించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. బోర్డు నిబంధనల ప్రకారం ప్రతీ ఐదేళ్లకోసారి సిలబస్​లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఈ ఏడాది మొదటి సంవత్సరం తెలుగు, రెండో సంవత్సరంలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్​లో మార్పులు చేర్పులు చేసినట్లు జలీల్ తెలిపారు.  

తొలగించిన టాపిక్స్​

రెండో సంవత్సరం హిస్టరీలో తెలంగాణ ప్రజా సమితి, ఎనిమిది పాయింట్ల ఫార్ములా, పొలిటికల్ సైన్స్​లో ఈ గవర్నెన్స్, ఎన్నికల సంస్కరణలు, సమాచార హక్కు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్​లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు, కలెక్టర్ల పాత్ర, గ్రామ సచివాలయం, ఎన్నికల కమిషన్, కాగ్ తదితర పాఠాలను తొలగించారు. మొదటి సంవత్సరం హిస్టరీలో క్విట్ ఇండియా ఉద్యమం, ఎకనామిక్స్​లో ద్రవ్యోల్బణం, పొలిటికల్ సైన్స్​లో పౌరసత్వ పరిచయం, పౌరసత్వ రకాలు, తదితర పాఠాలు తొలగించారు.  

ఇదీ చదవండి :భూరికార్డుల పారదర్శకత కోసమే ధరణి పోర్టల్‌కు శ్రీకారం: సీఎం

Last Updated : Sep 22, 2020, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details