- ఎంసెట్ నోటిఫికేషన్ ఎప్పుడు?
సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది. మరో వారంలో ఎంసెట్ కమిటీ సమావేశమవుతుంది. అందులో ప్రకటన ఎప్పుడివ్వాలో నిర్ణయిస్తాం. విద్యార్థులు మొదట్లోనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. చివరి నిమిషంలో హడావుడి పడితే వివరాల నమోదులో తప్పులు దొర్లుతాయి. దానివల్ల పరీక్షల సన్నద్ధతపై పూర్తిగా దృష్టి సారించలేరు.
- దరఖాస్తు సమయంలో విద్యార్థులు చేసే పొరపాట్లు ఏమిటి?
చాలా మంది విద్యార్థులు వారు చదివే కళాశాలల సిబ్బంది, ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులపై ఆధారపడి దరఖాస్తులను పంపుతున్నారు. ఆన్‌లైన్ ఫారాన్ని నింపిన తర్వాత సరిచూసుకోవడం లేదు. దాంతో వేల దరఖాస్తుల్లో వివరాలు తప్పుగా ఉంటున్నాయి. అనేక మంది సొంత ఫోన్ నంబరు, మెయిల్ ఐడీ కూడా ఇవ్వడం లేదు. ఇంటర్నెట్ నిర్వాహకులు తమ ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీ ఇస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత పొరపాట్ల సవరణ చేసుకోవాలని, ఫలానా సమాచారం కావాలని మేం ఆయా నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లు, మెయిళ్లకు వివరాలు పంపిస్తాం. అవి చాలామంది విద్యార్థులకు చేరటం లేదు. చివర్లో కంగారు పడుతూ ఫోన్లు చేస్తుంటారు. హైదరాబాద్‌లోని ఎంసెట్ కార్యాలయానికి వస్తుంటారు.
- గత ఏడాది వందల మందికి ర్యాంకులు ప్రకటించని పరిస్థితిని ఎలా అధిగమించబోతున్నారు?