పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి: డీజీపీ - telangana dgp mahender reddy
తెలంగాణలో ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. పారదర్శకంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షిస్తుండాలని ఆదేశించారు.