శాసన మండలిలో రెవెన్యూ బిల్లుకు ఆమోదం - తెలంగాణ రెవెన్యూ బిల్లు వార్తలు
14:17 September 14
శాసన మండలిలో రెవెన్యూ బిల్లుకు ఆమోదం
శతాబ్దాల భూ వివాదాల పీడ విరగడయ్యేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పేద రైతులకు ప్రయోజనంతోపాటు ఒక్కపైసా అవినీతికి తావులేని పద్ధతిలో మూడేళ్లు కష్టపడి చట్టానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మండలిలో కొత్త రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. చర్చ అనంతరం బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. శాసనమండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.
ఇదీ చదవండి:పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు: సీఎం