శాసనమండలి సమావేశాలు ముగిశాయి. కరోనా కేసుల నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించారు. ఒక శాసనసభ్యునితో పాటు పలువురు సిబ్బంది, పోలీసులకు కొవిడ్ సోకింది. సభా వ్యవహారాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే పేషీల్లో కూడా కొందరికి కరోనా వచ్చింది. రోజురోజుకూ కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలను ఇంకా కొనసాగిస్తే మరింత మందికి సోకే అవకాశం ఉందనే భావిస్తున్నారు. ఈ మేరకు మండలిని వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ గుత్తా సుఖేందర్ ప్రకటించారు.
శాసనమండలి నిరవధిక వాయిదా - తెలంగాణ శాసనమండలి వార్తలు
gutta sukhendhar reddy
14:25 September 16
శాసనమండలి నిరవధిక వాయిదా
Last Updated : Sep 16, 2020, 2:51 PM IST