రాష్ట్రంలో హత్యలు, మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నేరాలు, మహిళలపై దాడులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పోలీస్ యంత్రంగాన్ని తెరాస నేతల కోసమే వినియోగిస్తున్నారని ఆరోపించారు.
నేరాలకు కారణం మద్యమే... తీసేయండి: భట్టి - batti vikramarka meet governor
రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. విచ్చల విడిగా మద్యం అమ్మడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. దిశ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు.
batti
భట్టి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం... రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసింది. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలు, గ్రామాల్లో బెల్టు షాపులు తొలగించాలని కోరింది.
ఇదీ చూడండి: హలో పేరెంట్స్.. మీ అబ్బాయికి ఈ విషయాలు చెప్తున్నారా?