భాజపా నేతలను వెంటాడుతామని (telangana cm kcr fires bjp) ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వరి వేయాలన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద భాజపా నేతలు డ్రామాలాడుతున్నారని విమర్శించిన కేసీఆర్.. అసలే కోపం, ఆవేదనతో ఉన్న రైతులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వడ్లు కొంటారా.. కొనరా అని ప్రశ్నిస్తున్న రైతులపై (telangana cm kcr fires on bandi sanjay)దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అయినా కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం బండి సంజయ్కు ఏమొచ్చిందని నిలదీశారు. మొత్తం ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్పామని.. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే వడ్లు కొనడం ప్రారంభించామని స్పష్టం చేశారు.
'నేరుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడిని అడుగుతున్నా.. యాసంగిలో వరి వేయమని చెప్పినవ లేదా.. ఒకవేళ తప్పు చెబితే తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి. పొరపాటు చెప్పినానని చెంపలేసుకోవాలే.. నిజాయతీ ఉంటే వరి వేయకండి అని రైతులకు చెప్పాలే.. పొరపాటుగా చెప్పినానని ముక్కు నేలకు రాయాలి.'
- కేసీఆర్. రాష్ట్ర ముఖ్యమంత్రి