ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే! - తెలంగాణ కేబినెట్ మీటింగ్

రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా సహా... శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించే అవకాశం ఉంది. రాబోయే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు, హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు కీలకనిర్ణయాలు తీసుకునే వీలుంది. మండలిలో గవర్నర్‌ కోటాలో భర్తీచేసే 3 స్థానాలపైనా చర్చిస్తారని తెలుస్తోంది.

kcr
kcr
author img

By

Published : Sep 7, 2020, 7:16 PM IST

Updated : Sep 7, 2020, 9:00 PM IST

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టం ముసాయిదా సహా శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులు, శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించే అవకాశముంది. ఇప్పటికే రెవెన్యూ చట్టం ముసాయిదాపై కసరత్తు పూర్తయింది. ఆహారశుద్ధి, లాజిస్టిక్స్‌ విధానం ముసాయిదాలు సిద్ధమయ్యాయి. వీటన్నింటికీ మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది.

రాబోయే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు, హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం నగర పాలక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకునే వీలుంది. గవర్నర్‌ కోటాలో భర్తీచేసే మూడు ఎమ్మెల్సీ స్థానాలపైనా చర్చిస్తారని తెలుస్తోంది. మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్‌లకు ఎమ్మెల్సీలుగా మరోమారు అవకాశం ఇస్తారని సమాచారం. మూడో స్థానానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకాధికారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్‌, మహబూబాబాద్‌ మాజీ ఎంపీ అజ్మీరా సీతారామ్‌నాయక్‌ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

ఇదీ చదవండి:ఖాజిపల్లి అర్బన్​ ఫారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్​

Last Updated : Sep 7, 2020, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details