పామాయిల్ దిగుమతులు పూర్తిగా తగ్గించాలంటే ఆయిల్‌పామ్ సాగును ఉద్ధృతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణకు సుమారు 3.66 లక్షల టన్నుల పామాయిల్ అవసరముందని, ప్రస్తుతం 38వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని తెలిపారు.
'వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు' - minister niranjan reddy about oil palm cultivation
రాష్ట్రంలో సాగు నీటి వనరులు అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఆయిల్‌పామ్ పంట సాగు, విస్తీర్ణం పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఉద్యాన శిక్షణ సంస్థలో ఆయిల్‌పామ్ సాగు ప్రోత్సాహంపై జరిగిన బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ నాంపల్లి ఉద్యాన శిక్షణ సంస్థలో ఆయిల్‌పామ్ సాగు ప్రోత్సాహంపై జరిగిన బ్యాంకర్ల కమిటీ సమావేశానికి మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పంట సాగు, రైతులకు రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. పామాయిల్ కొరత అధిగమించడానికి 2.50 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని మంత్రి అన్నారు. నూనె గింజల పంటల్లో పామాయిల్ ఎక్కువ దిగుబడినిస్తోందని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేయవచ్చని చెప్పారు.
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పంట సాగు ఉద్ధృతం చేయనున్న దృష్ట్యా ఆయిల్‌పామ్ సాగుకై 25 జిల్లాల్లో 8.14 లక్షల ఎకరాలు గుర్తించామని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఒక ఎకరా ఆయిల్‌పామ్ సాగు చేయడానికి మొదటి నాలుగేళ్లకు సూక్ష్మ సేద్యం పథకంతో కలిపి 1,38,680 రూపాయలు ఖర్చవుతుందని.. ఇందులో 31,832 రూపాయల వరకు ప్రభుత్వం ద్వారా రాయితీ అందిస్తోందని వెల్లడించారు.
- ఇదీ చూడండి :చట్టాల రద్దుకు రైతుల డిమాండ్- కేంద్రం ససేమిరా!