తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 5PM - టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Jun 19, 2022, 4:57 PM IST

Updated : Jun 19, 2022, 5:24 PM IST

  • 'అగ్నిపథ్​పై వెనక్కి తగ్గం.. ఆ నిరసనకారులను చేర్చుకోం!'

సైన్యాన్ని యువత, అనుభవజ్ఞుల కలయికతో తయారు చేసేందుకే అగ్నిపథ్ స్కీమ్​ను తీసుకొచ్చినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సర్వీసులో వారి పట్ల వివక్ష ఉండబోదని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని వెనక్కి తీసుకునేదే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు, నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడుతున్న యువతకు షాక్ ఇచ్చారు.

  • వాటిని అమ్మడమంటే.. రాష్ట్రాల హక్కులు హరించడమే: కేటీఆర్

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహస్యం చేసేలా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు.

  • ఉద్రిక్తంగా మారిన చెరుకు రైతుల ధర్నా

జగిత్యాలలో చెరుకు రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనలకు అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన రైతులు డీఎస్పీని నెట్టివేశారు.

  • బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత..

బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిజామాబాద్‌ నుంచి విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బాసరకు వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాంగణం లోపలికి వెళ్లేందుకు వారు యత్నించడంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.

  • 'లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ సింహాసనం సిద్ధం'

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఖజానాలో మరో వస్తువు చేరింది. స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణంలో ఉపయోగించేందుకు వీలుగా అమెరికా నుంచి వచ్చిన భక్తుడు స్వర్ణ సింహాసనం సమర్పిచారు. రూ.18లక్షల విలువైన బంగారంతో ఈ సింహాసనాన్ని తయారు చేయించారు.

  • ముస్లిం పెళ్లిలో 'బుల్డోజర్ బరాత్'..

ఉత్తర్​ప్రదేశ్​లో ఈమధ్య ఎక్కడ చూసినా 'బుల్డోజర్' మాటే వినిపిస్తోంది. అయితే, ఇది నేరస్థుల ఇళ్లను ప్రభుత్వాలు కూల్చేయడానికే పరిమితం అనుకుంటే పొరపాటే! ఇటీవల ఓ ముస్లిం జంట వివాహ వేడుకలోనూ బుల్డోజర్ కనిపించింది.

  • టేకాఫ్​ అయిన వెంటనే ప్రమాదం.. లక్కీగా...

పట్నా నుంచి దిల్లీకి వెళ్లాల్సిన స్పైట్​జెట్​ విమానంలో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేయగా.. ఎటువంటి నష్టం జరగలేదు. ఇంజిన్​ను పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్పైస్​జెట్​ ప్రతినిధులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు అధికారులు.

  • డెబిట్, క్రెడిట్ కార్డులకు ఆర్​బీఐ కొత్త రూల్స్​..

కార్డుల వినియోగంలో పారదర్శకతతో పాటు వినియోగదారుల హక్కులు పరిరక్షించేలా కొత్త నిబంధనల్ని తీసుకువచ్చింది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. వీటిని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

  • ఒకే జట్టులో కోహ్లీ, బాబర్..?

ప్రపంచంలోని మేటి ఆటగాళ్ల జాబితాలో ఉన్న విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్​ ఒకే జట్టులో ఓ మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుంది..? ఏకంగా ఓ సిరీస్ ఆడితే..? అది మీ ఊహకే వదిలేస్తున్నాం.

  • కలయిక కుదరకపోతే మహిళ సర్జరీ చేయించుకోవాలా?

సెక్స్​లో పాల్గొని ఆ అనుభూతిని పొందేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొంతమంది పలు కారణాల వల్ల శృంగారాన్ని ఆస్వాదించలేకపోతారు. కలయిక కుదరక నిరాశ చెందుతుంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటి?

Last Updated : Jun 19, 2022, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details