ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టులు, నిర్బంధాల పేరుతో మహిళలను వేధిస్తున్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. 144 సెక్షన్ పేరుతో రాజధాని గ్రామాల్లో దౌర్జన్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని గ్రామాల్లో అధికార దుర్వినియోగాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని గల్లా జయదేవ్ వివరించారు.
మహిళా కమిషన్‌ను కలిసిన తెదేపా నేతలు.. - amaravathi farmers protest
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటించింది. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో మహిళా కమిషన్ సభ్యులను తెదేపా నేతలు కలిశారు. గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ, గద్దె అనురాధ, దివ్యవాణి బృందాన్ని కలిశారు. రాజధానిలో మహిళలపై దాడిని కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ సభ్యులు కాంచన కట్టర్, ప్రవీణ్ సింగ్‌లకు వినతిపత్రం అందజేశారు.
మహిళా కమిషన్ బృందాన్ని కలిసిన తెదేపా నేతలు
రాజధాని గ్రామాల్లో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని పంచుమర్తి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి రైతుల ఇళ్లలోకి వచ్చి సోదాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అమ్మవారికి మొక్కుల కోసం వెళ్తే ఇష్టానుసారం కొడతారా..? అని గద్దె అనురాధ ప్రశ్నించారు. నిరాయుధులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్యని దుయ్యబట్టారు.
ఇవీ చూడండి: నర్మదా నదిలో ఐసీడీఎస్ ఉద్యోగి గల్లంతు