సంగం డెయిరీ ఛైర్మన్, తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన వీరిద్దరికీ సోమవారం.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జైలు నుంచి విడుదలైన తెదేపా నేత ధూళిపాళ్ల - guntur district news
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు నుంచి తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర విడుదలయ్యారు. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా విడుదలయ్యారు.
జైలు నుంచి విడుదలైన తెదేపా నేత ధూళిపాళ్ల
4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని.. నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణాధికారికి ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచించింది. ధూళిపాళ్లను విచారించాలంటే 24 గంటల ముందు నోటీసు ఇవ్వాలని విచారణాధికారికి హైకోర్టు స్పష్టం చేసింది.
ఇవీచూడండి:విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకి మంటలు