వడ్డీ లేని రుణాల అంశంపై ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ప్రతిపక్షం మరోసారి ధ్వజమెత్తింది. ఈ అంశంపై చర్చ ప్రారంభించిన నిమ్మల రామానాయుడు... గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రుణాలను సభకు చదివి వినిపించారు. అనంతరం చంద్రబాబు సమాధానమిచ్చారు. తాము అధికారంలో ఉన్నంత కాలంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చామని అందుకు ప్రభుత్వం వద్ద ఉన్న దస్త్రాలే సాక్ష్యమని సభ ముందు కొన్ని దస్త్రాలు ఉంచారు.
'సున్నా' చుట్టూ తిరిగిన ఏపీ శాసన సభ... - babu
వడ్డీ లేని రుణాలపై ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగిన సవాల్ ప్రతిసవాల్ నేడూ సభను కుదిపేశాయి. దీనిపై చర్చకు తెలుగుదేశం పట్టుబట్టగా... అధికార పక్షం అందుకు అంగీకరించింది. దీంతో చర్చ కొనసాగింది.
chandra babu