తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రతిపక్ష అభ్యర్థులకు భద్రత కల్పించండి: ఎస్ఈ​సీకి అచ్చెన్న లేఖ - వైకాపాపై అచ్చెన్నాయుడు ఆగ్రహం

ఏపీ స్థానిక సంస్థల బరిలో నిలిచిన తెదేపా అభ్యర్థులే లక్ష్యంగా అధికార వైకాపా శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయంటూ.. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రతిపక్ష అభ్యర్థులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని కోరారు. దాడులకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

acchanna
acchanna

By

Published : Nov 24, 2020, 10:51 AM IST

ఏపీలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్న తెదేపా అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణులు అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందని లేఖలో వెల్లడించారు.

ఎస్​ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ

దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. ప్రతిపక్ష అభ్యర్థులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. కేంద్ర భద్రతా దళాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలన్నారు.

సంతమాగులూరు మండలంలో తమ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని తెలిపారు. వైకాపా హత్యా రాజకీయాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. వైకాపా నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:'తెరాసకు ఓటేయండి... గ్రేటర్​ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం'

ABOUT THE AUTHOR

...view details