తెలంగాణ

telangana

ETV Bharat / city

డీజీపీ కార్యాలయం ముట్టడికి తెదేపా యత్నం, ఉద్రిక్తత - కుప్పం ఘటనకు నిరసనగా తెదేపా డీజీపీ ఆఫీస్​ ముట్టడి

tdp leaders protest at dgp office ఏపీలోని కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు తెదేపా నేతలు ర్యాలీ నిర్వహించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు. డీజీపీ కార్యాలయం గేటు దూకేందుకు యత్నించారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా నేతల వినతి పత్రాన్ని పోలీసులు స్వీకరించారు.

డీజీపీ కార్యాలయం ముట్టడికి తెదేపా యత్నం, ఉద్రిక్తత
డీజీపీ కార్యాలయం ముట్టడికి తెదేపా యత్నం, ఉద్రిక్తత

By

Published : Aug 25, 2022, 6:44 PM IST

డీజీపీ కార్యాలయం ముట్టడికి తెదేపా యత్నం, ఉద్రిక్తత

tdp leaders protest at dgp office: ఆంధ్రప్రదేశ్​లోని మంగళగిరిలో తెదేపా శ్రేణులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించాయి. ప్రధాన ద్వారాన్ని తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నల్లజెండాలు, తెదేపా జెండాలతో గేటు వద్దే అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి డీజీపీ కార్యాలయానికి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

కుప్పంలో చంద్రబాబుని అడ్డుకునే యత్నం, అన్న క్యాంటీన్​పై దాడిని నిరసిస్తూ అచ్చెన్నాయుడు.. డీజీపీ కార్యాలయానికి కాలినడకన వెళ్లారు. అచ్చెన్నాయుడు వెంట పీతల సుజాత, ఎం.ఎస్. రాజు, తెనాలి శ్రావణ్ కుమార్, నాదెండ్ల బ్రహ్మం, ఇతర తెదేపా నేతలు నిరసనగా బయలుదేరారు. డీజీపీ కార్యాలయం గేటు ఎక్కి దూకేందుకు తెదేపా శ్రేణులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details