విలువలులేని రాజకీయ నాయకులు తమ పీఠంపై ఆరోపణలు చేయడం దురదృష్ణకరమని ఏపీలోని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. దేశవ్యాప్తంగా విశాఖ శారదాపీఠం విశిష్టత కలిగిన పీఠమని పేర్కొన్నారు. శారదాపీఠం ధర్మం కోసం పోరాడుతుందని, వ్యక్తి, రాజకీయపార్టీల కోసం కాదన్నారు. అనంతపురంలో స్వాత్మ నందేంద్ర సరస్వతి పర్యటించారు.
'శారదాపీఠం ధర్మం కోసం పోరాడుతోంది'
విలువలు లేని వాళ్లే విశాఖ శారదా పీఠం గురించి ఆరోపణలు చేస్తారని ఏపీలోని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. శారదా పీఠం భారతదేశంలో విలక్షణమైనదని, విశిష్టమైనదని చెప్పారు.
'శారదాపీఠం ధర్మం కోసం పోరాడుతుంది'
భారతీయ సనాతన సంప్రదాయాల్లో ముఖ్యమైనవి నదులు, తీర్థాలని.. వాటిని కాపాడుకోవాలని స్వాత్మానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న సమయంలో తుంగభద్ర పుష్కరాలు రావడం భగవంతుని ఆశీస్సులేనన్నారు. భక్తులు స్నానం ఆచరించినా, లేకపోయినా నీరు తలపై చల్లుకోవాలని సూచించారు.