కరోనా వైరస్ ప్రపంచం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. సామాన్య ప్రజలైతే.. ఉపాధి కోల్పోయి నానా ఇక్కట్లు పడ్డారు. హైదరాబాద్లోని నాంపల్లిలో గల శ్రీ సాయిరామ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సొసైటీ అటిజం, మల్టిపుల్ డిసేబుల్డ్ సమస్యలున్న పిల్లలకు వసతి కల్పించి చదువు నేర్పిస్తోంది.
విరాళాల తోనే..
విరాళాల మీదనే నడిచే ఈ పాఠశాల గత ఆరు నెలలుగా కరోనా ప్రభావం వల్ల దాతల సహాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. అద్దె కట్టడానికి, పిల్లలకు తిండి పెట్టడానికి కూడా అనేక అవస్థలు పడుతున్నారు. సమాచారం అందుకున్న సువర్ణ ఫౌండేషన్ సంస్థ ఛైర్మన్ రాజేష్ బెస్త వారికి అండగా నిలిచారు. పిల్లలకు నూతన వస్త్రాలు , నిత్యావసర సరుకులతో పాటు స్కూల్ నిర్వహణకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.