ఈఎస్ఐ కుంభకోణంలో ఫార్మసిస్టుపై సస్పెన్షన్ వేటు - కుంభకోణం
ఈఎస్ఐ కుంభకోణంలో చర్లపల్లి డిస్పెన్సరీలో ఫార్మాసిస్టుగా పని చేస్తున్న లావణ్యను కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే 48 గంటల జ్యూడీషియల్ ఖైదీగా ఉన్నందున నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈఎస్ఐ బీమా వైద్య సేవల కుంభకోణంలో మరో ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. చర్లపల్లి డిస్పెన్సరీలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న లావణ్యను కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఔషధాల కుంభకోణంలో చర్లపల్లి డిస్పెన్సరీలో రూ.17 లక్షలు గోల్మాల్ చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. లావణ్యను ఈ నెల 11న అనిశా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 48 గంటలకు పైగా జ్యుడిషియల్ ఖైదీగా ఉన్నందున లావణ్యను నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ దేవికారాణితో పాటు ఐదుగురిని కార్మిక శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు.