రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో మునగనూరు నుంచి తొర్రూర్ వెళ్లే దారిలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన ఉన్న ఇంజపూర్ బాతుల చెరువు నుంచి భారీగా వరద రావడంతో.. నీరు రోడ్డుపై నుంచి పారుతోంది. రోడ్డు దాటుతుండగా ఒక వ్యక్తి నీటిలో పడి కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి వెంటనే అతన్ని కాపాడారు.
వరద మీ ముందుండగ.. సాహసాలెందుకు దండగ - వరద మీ ముందుండగ.. సాహసాలెందుకు దండగ
ఎగువన ఉన్న ఇంజపూర్ బాతుల చెరువు నుంచి భారీగా వరద పోటెత్తడంతో.. హయత్ నగర్ పరిధిలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వరద ప్రవాహానికి వ్యక్తులు కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. వాహనాలూ అలాగే కొట్టుకుపోతుండగా.. బైక్ను వదిలేసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. రోడ్డు దాటుతూ వరదలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డారు
వరద మీ ముందుండగ.. సాహసాలెందుకు దండగ
అదేవిధంగా ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వరద ధాటికి బైక్ పైనుంచి వారు కిందపడ్డారు. బైక్ను వెంటనే బయటకు తీయడానికి విఫలయత్నం చేశారు. చివరికి బైక్ను వదిలేసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు.
ఇదీ చూడండి: వర్షాలు తగ్గినా.. కష్టాలు తీరడం లేదు...