విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా సీఐటీయూ, ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
విశాఖపట్నం జిల్లా
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోవాలని డా.బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు ఐ.గురుమూర్తి డిమాండ్ చేశారు. నగరంలోని అంబేడ్కర్ భవన్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం... సామాన్యులకు ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు పెట్టుబడిదారులకు ద్వారాలు తెరుస్తుందని విమర్శించారు.
కడప జిల్లాలో...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కడప కలెక్టరేట్ ఎదుట ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కేంద్రం.. కర్మాగారం ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.