తెలంగాణ

telangana

ETV Bharat / city

Deputy cm: డిప్యూటీ సీఎం నుంచి ఆ శాఖ తొలగింపు.. - డిప్యూటీ సీఎం నారాయణస్వామి వార్తలు

ఏపీ ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా ఉన్న నారాయణస్వామి(AP Deputy CM NarayanaSwami) నుంచి వాణిజ్య పన్నుల శాఖ(Department of Commercial Taxes)ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఆయన్ను ఎక్సైజ్‌ శాఖకే పరిమితం చేసింది.

AP Deputy CM Narayana swami
AP Deputy CM Narayana swami

By

Published : Oct 31, 2021, 12:07 PM IST

ఏపీ వాణిజ్య పన్నుల శాఖ(Department of Commercial Taxes)ను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి(deputy cm narayanaswamy) వద్ద నుంచి ప్రభుత్వం తప్పించింది. ఆ శాఖను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(finance minister buggana rajendranath)కి అప్పగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం నారాయణస్వామి వద్ద ఎక్సైజ్ శాఖ(excise department) మాత్రమే ఉంది.

వాణిజ్య పన్నులు, స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించినా.. అభ్యంతరాలు వ్యక్తమవటంతో అమలు కాలేదు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రికి బదలాయించగా.. త్వరలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖనూ మార్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details