తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ రాష్ట్రానికి బస్సులు నడపాలని ఏపీఎస్​ఆర్టీసీ నిర్ణయం

ఏపీ నుంచి కర్ణాటకకు రోడ్డు రవాణా బస్సు సర్వీసులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించిన నేపథ్యంలో సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు ప్రారంభించనున్నారు. బస్సుస్టేషన్ నుంచి బస్ స్టేషన్ వరకు టికెట్లు బుకింగ్ చేసుకునేందుకే ఆర్టీసీ అవకాశం కల్పించింది.

ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు నడపాలని ఏపీఎస్​ఆర్టీసీ నిర్ణయం
ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు నడపాలని ఏపీఎస్​ఆర్టీసీ నిర్ణయం

By

Published : Jun 14, 2020, 10:31 PM IST

ఏపీ నుంచి కర్ణాటకకు రోడ్డు రవాణా బస్సు సర్వీసులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి బెంగళూరు సహా పలు ప్రాంతాలకు 168 బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. నాలుగు దశల్లో మొత్తం 500 బస్సు సర్వీసులకు పెంచాలని నిర్ణయించారు. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు ప్రారంభించనున్నారు. బస్సుస్టేషన్ నుంచి బస్ స్టేషన్ వరకు టికెట్లు బుకింగ్ చేసుకునేందుకే ఆర్టీసీ అవకాశం కల్పించింది.

బస్సుల్లో అవి తప్పనిసరి..

బస్సుల్లో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగం తప్పనిసరని ఆర్టీసీ స్పష్టం చేసింది. రాష్ట్రానికి వచ్చిన వారిలో 5 శాతం మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్టాండ్లలో కరోనా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు రోడ్డు రవాణా సంస్థ ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రొటోకాల్ పాటించాలని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి : దిల్లీలో కరోనా కట్టడికి షా 'ఆపరేషన్ ఐఏఎస్​'

ABOUT THE AUTHOR

...view details