గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో జరిగే పరేడ్‌లో తొలిసారి రాష్ట్ర శకటం కనిపించనుంది. ఈ మేరకు రాష్ట్రం రూపొందించిన శకటం పరేడ్‌కు ఎంపికైంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ, మేడారం జాతరతో పాటు ఓరుగల్లులోని వేయి స్తంభాల గుడి ఇతివృత్తంతో రాష్ట్ర శకటాన్ని రూపొందించారు.
గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటం - రిపబ్లిక్ డే పేరెడ్‌లో తెలంగాణ శకటం..!
రిపబ్లిక్ డే రోజున దిల్లీలో జరిగే పరేడ్‌లో తొలిసారి రాష్ట్ర శకటం పొల్గోనుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ, మేడారం జాతరతో పాటు ఓరుగల్లులోని వేయి స్తంభాల గుడి ఇతివృత్తంతో రాష్ట్ర శకటం రూపొందించారు.
గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటం
మన సంస్కృతి కనువిందు..
శకటంపైనా, ఇరువైపులా జానపద నృత్యాలు కనువిందు చేయనున్నాయి. సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శకటం ఎంపిక కోసం కృషి చేసిన దిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అభినందించారు.
Last Updated : Dec 19, 2019, 9:39 PM IST