తెలంగాణ

telangana

ETV Bharat / city

Mahanandi Koneru Speciality : శివ గంగా.. అడుగిడంగా.. మహానంది కోనేటి ప్రత్యేకత - Mahanandi Koneru

Mahanandi Koneru Speciality : ఏపీలోని కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది. ఈ ఆలయంలోని కోనేరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా..!

Mahanadi Koneru
Mahanadi Koneru

By

Published : Dec 23, 2021, 2:20 PM IST

మహానంది కోనేటి ప్రత్యేకతేంటో తెలుసా

Mahanandi Koneru Speciality : ఏపీలోని కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది. ఈ ఆలయంలోని కోనేరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ కోనేటిలోకి చేరే నీరు గర్భాలయం కింద నుంచి వస్తుందని పురాణాలు చెబుతాయి. కోనేరు చుట్టూ ఉన్న రాతి గోడ మధ్య నుంచి ఈ నీరు వస్తుందనే విషయాన్ని ఓ అర్చకుడు గమనించాడు.

ఇదే విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అధికారుల అనుమతితో అక్కడ ఒక పైపును ఏర్పాటు చేశారు. పైపు నుంచి నీరు వేగంగా రావటం గమనించిన అర్చకులు ఆ నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా మహానంది కోనేరులో నీరు చేరుతుందని.. ఆ జలం ఎంతో పవిత్రమైనదని ఆలయ అర్చకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details