తెలంగాణ

telangana

ETV Bharat / city

893 మంది స్పెషలిస్టు వైద్యులకు పోస్టింగ్‌ - telangana postings

Posting for Specialist Doctors రాష్ట్రంలో 893 మంది స్పెషలిస్టు వైద్యులకు ఈరోజు నుంచి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఏడాది పాటు తప్పనిసరి సేవల నిబంధన కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియమిస్తారు.

Posting for Specialist Doctors
Specialist doctors postings from today in telangana

By

Published : Aug 23, 2022, 7:11 AM IST

Posting of Specialist Doctors : కన్వీనర్‌ కోటాలో పీజీ వైద్య విద్య పూర్తి చేసుకున్న 2019-2022 బ్యాచ్‌కు చెందిన 893 మంది స్పెషలిస్టు వైద్యులకు ఈరోజు నుంచి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. వీరందరినీ ఏడాది పాటు తప్పనిసరి సేవల నిబంధన కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియమిస్తారు. హైదరాబాద్‌ మినహాయించి (ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలలు కాకుండా) మిగిలిన జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియమించడానికి కోఠిలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు.

ఇవాళ ఉదయం 10 గంటల నుంచి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌ వైద్యులకు.. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పిడియాట్రిక్స్‌, రెస్పిరేటరీ మెడిసిన్‌, డెర్మటాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌, రేడియేషన్‌ ఆంకాలజీ వైద్యులకు.. 24న ఉదయం 10 గంటల నుంచి జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్‌టీ, ఆఫ్తల్మాలజీ వైద్యులకు..మధ్యాహ్నం 1.30 గంటలకు అబ్‌స్ట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, అనస్థీషియా వైద్యులకు కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టింగ్‌లు ఇస్తారని వైద్య వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details