SP Dance for bullet song: బుల్లెట్టు బండి పాట స్టెప్పుల ఖాతాలో తాజాగా పోలీసు అధికారి కూడా చేరారు. చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకూ అందరినీ అలరించిన ఈ పాటకు.. ఓ పోలీసు అధికారి స్టెప్పులేసి చుట్టూ ఉన్నవారిని అలరించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. ఆటపాటలతో సందడి చేశారు. జిల్లాలోని కంబదూరు సమీపంలోని అండేపల్లి గ్రామంలోని రామప్పకొండపై.. పోలీసు అధికారులు వన భోజనాలు ఏర్పాటుచేశారు. జిల్లాలోని పోలీసు కుటుంబాలు ఈ వనభోజనాల్లో పాల్గొన్నాయి.
SP Dance for bullet song: "బుల్లెట్టు బండి" పాటకు.. పోలీస్ బాస్ స్టెప్పులు..!
SP Dance for bullet song:'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా..' జనాల మధ్యకు పాట వచ్చి నెలలు గడుస్తున్నా.. ఆ పాటకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏ ఫంక్షన్ చూసినా.. ఏ పెళ్లికి వెళ్లినా ఈ పాటకు తమదైన శైలిలో చిందులు వేయకుండా ఊరుకోరు. డీజేలో నవ వధువు డుగ్గు డుగ్గు స్టెప్పులు వేసినప్పటి నుంచి ఈ పాట మరింత ఆదరణ సంపాదించుకుంది. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కూడా చిందేశారంటే అతిశయోక్తి కాదు. కానీ విధుల్లో భాగంగా ఎప్పుడూ సీరియస్గా ఉండే ఓ పోలీసు ఉన్నతాధికారి.. బుల్లెట్ పాటకు చిందులేశారంటే ఆశ్చర్యమే కదా.. ఏపీలోని అనంతపురం జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
బుల్లెట్ బండి పాటకు ఎస్పీ డాన్స్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ ఫక్కీరప్ప.. వారితో ఆడిపాడారు. ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన "బుల్లెట్ బండి" పాటకు నృత్యం చేసి అందర్నీ ఉత్తేజపరిచారు. వనభోజనాల సందర్భంగా ఎస్పీ చేసిన డ్యాన్సుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చదవండి:Dancer Ravi kumar: రవి ఆటకు నృత్యమే మైమరచిపోయింది.. 10 వేల మందికి...