ప్లాస్టిక్‌ను నివారించాలని.. పర్యావరణాన్ని కాపాడాలని.. ఇలా ఎవరు చెప్పినా వింటాం. పది మందికి చెప్తాం. కానీ మనమే పాటించం. మన ఒక్కరి వల్ల ఏమవుతుందిలే అనుకుంటాం. యథేచ్ఛగా ప్లాస్టిక్‌ను వాడేస్తాం. కానీ హైదరాబాద్ ఎల్బీనగర్లోని రాక్‌టౌన్ కాలనీలో నివాసం ఉంటున్న దోసపాటి రాము అలా అనుకోలేదు. తన వంతు పర్యావరణానికి మేలు చేయాలని... కొంతమందిలోనైనా మార్పు తీసుకురావాలని తలచాడు.
చేతి నిండా ప్లాస్టిక్‌తో రండి..
రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించాడు. ఇప్పటికే వినియోగించిన ప్లాస్టిక్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి నాగోల్ వెళ్లే రహదారిలో నర్సరీని ఏర్పాటు చేశాడు. 'ప్టాస్టిక్ కవర్లతో రండి.. మీకు నచ్చిన పూల మొక్కలను తీసుకెళ్లండి' పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. పూణె నుంచి మొక్కలు తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.