ఏపీలోని కర్నూలు జిల్లా గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనంలో దూరిన పాము కలకలం రేపింది. ఆ సర్పాన్ని బయటకు రప్పించేందుకు బైకు యజమాని నానా తంటాలు పడ్డారు. వాహనం పెట్రోల్ ట్యాంక్, తదితర భాగాలను వేరుచేయాల్సి వచ్చింది. ఓ వ్యక్తి పాము తోక పట్టుకుని బయటకు లాగగా.. సగభాగం తెగిపోయింది. ఆ తర్వాత బైకులోపల మిగిలిన భాగాన్నీ బయటకు లాగి కర్రలతో కొట్టి చంపేశారు.
తిరుమలలో కొండచిలువ హల్‌చల్..