తెలంగాణ

telangana

ETV Bharat / city

SNAKE VIRAL VIDEO: నాగుపాము హల్‌చల్‌.. భయంతో పరుగులు తీసిన జనం - telangana news

ఏపీలోని తిరుపతిలో నాగుపాము హల్‌చల్‌ చేసింది. ఓ స్కూటీ నుంచి బయటకొచ్చి ప్రజలను ఆందోళనకు గురి చేసింది. దీంతో ప్రజలు రోడ్డు వెంబడి పరుగులు తీశారు.

SNAKE VIRAL VIDEO, snake in scooty
నాగుపాము హల్‌చల్‌, స్కూటీలో నాగుపాము

By

Published : Sep 10, 2021, 6:19 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరం నడిబొడ్డున ఓ నాగు పాము బుసలు కొట్టడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. నగరపాలక సంస్ధ కార్యాలయం సమీపంలోని ద్విచక్రవాహనం నుంచి బయటపడిన నాగుపాము రోడ్డు వెంబడి పరుగులు తీయటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

రోడ్డుపై నుంచి ఆ పాము ఓ దుకాణంలోకి వెళ్లి తిష్ట వేసింది. స్థానికులు వెంటనే పాములు పట్టడంలో నిపుణుడైన తితిదే ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

నాగుపాము హల్‌చల్‌

దీ చదవండి:RAPE: చిన్నారిని అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం నివేదిక

ABOUT THE AUTHOR

...view details