తెలంగాణ

telangana

ETV Bharat / city

చిన్న ఉపాయం... కోతులు పారిపోయేలా చేసింది - చిన్న ఉపాయం... కోతులు పారిపోయేలా చేసింది

ఏదైనా సమస్య ఉంటే దాని వెనుకే పరిష్కారమూ ఉంటుంది. కావాల్సిందల్లా కాసింత ఆలోచన. ఓ మహిళ కూరగాయలను బయట ఆరబెడుతుంటే కోతులు వాటిని నాశనం చేస్తున్నాయి. దీనిపై ఆలోచించిన ఆ మహిళ ఓ చిన్న ఉపాయంతో కోతులను పారిపోయేలా చేసింది. మరి ఆ ఆలోచనేంటో మనమూ చూద్దామా..!

small thought saves the food from monkeys in allagadda kurnool district
చిన్న ఉపాయం... కోతులు పారిపోయేలా చేసింది

By

Published : Feb 26, 2020, 10:06 PM IST

చిన్న ఉపాయం... కోతులు పారిపోయేలా చేసింది

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఓ మహిళ వినూత్న ఆలోచన ఆమెకు కోతుల బెడద నుంచి దూరం చేసింది. పట్టణానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ కూరగాయలను ఆరబెట్టేది. అయితే కోతులు మూకుమ్మడిగా దాడులు చేసి వాటిని నాశనం చేసేవి. దీనిపై ఆలోచించిన ఆ మహిళ బయట కూరగాయలను ఆరబెట్టి.. దానిపై పాము బొమ్మను ఉంచింది. అంతే అది నిజమైన పాము అనుకొని... కోతులు పరుగు లంకించుకుంటున్నాయి.

ఇవీ చూడండి:కాస్త కుదుటపడ్డ దిల్లీ- అల్లర్లకు 24 మంది బలి

ABOUT THE AUTHOR

...view details