శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆరో రోజు రాత్రి గజవాహన సేవను నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామివారు సర్వాలంకారభూషితుడై గజవాహనాన్ని అధిరోహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైధిక కార్యక్రమాలను జరిపారు.
తిరుమల బ్రహ్మోత్సవాలు: గజవాహనంపై విహరించిన శ్రీహరి - తిరుమల తాజావార్తలు
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరో రోజు ఘనంగా జరిగాయి. స్వామివారు సర్వాలంకారభూషితుడై గజవాహనాన్ని అధిరోహించారు. అర్చకులు వైధిక కార్యక్రమాలను జరిపారు.
తిరుమల బ్రహ్మోత్సవాలు: గజ వాహన సేవలో శ్రీవారు
జీయంగార్ల సాత్తుమొర, రంగనాయకుల మండపంలో అస్థానాలను వేడుకగా చేపట్టారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి వాహనసేవలో పాల్గొన్నారు.