అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షీ బృందాలు నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజాలో వీఆర్‌వన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలో యువతి, యువకులు ఉత్సాహంగా ఆడి పాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
సురక్షిత నగరం
మహిళల భద్రత విషయంలో షీ బృందాలు బాగా పనిచేస్తున్నాయని ఎస్‌కే జోషి అన్నారు. హైదాబాద్‌ను సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.మహిళల భద్రతకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నిర్వహించనున్న 2కె, 5కె, 10కె పరుగులో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొనలని డీజీపీ కోరారు.
ఎస్‌కే జోషి, మహేందర్‌రెడ్డి ఇతర అధికారులు మహిళా భద్రతకు సంబంధించిన గోడ పత్రికలు, కర పత్రాలను ఆవిష్కరించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి:'ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి'