నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన నగేశ్, తేజ దంపతులకు పిల్లలు లేరు. ఆ విషయం హైదరాబాద్లో ఉంటున్న తమ బంధువు కొండ లలితతో చెప్పారు. డబ్బులు ఇస్తే ఓ బాబును ఇప్పిస్తానని చెప్పింది లలిత. పని మీద శంషాబాద్ వచ్చిన లలిత.. కల్యాణ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని తమకు ఓ పిల్లాడు కావాలని చెప్పింది.
కిడ్నాప్
ఈ నెల 6న శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తనకు పరిచయమున్న వెంకటమ్మ అనే మహిళ కొడుకును కల్యాణ్ కిడ్నాప్ చేశాడు. బిడ్డ కనబడడం లేదంటూ వెంకటమ్మ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు గొర్రెల కల్యాణ్, సారంగి రాజు, సారంగి వసంత, కొండ లలిత, కొండ నగేశ్, కొండ తేజను అరెస్ట్ చేశారు.