మద్యం పాలసీని ప్రకటించిన శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో శేరిలింగంపల్లి, శంషాబాద్, చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో మొత్తం 81 మద్యం షాపులకు టెండర్లను పిలుస్తున్నట్లు సూపరింటెండెంట్ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. నవంబర్ ఒకటి నుంచి ప్రారంభం కానున్న షాపులకు గానూ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని చెట్లల్ల కృష్ణయ్య ఫంక్షన్ హాల్ గార్డెన్లో ఈరోజు నుంచి వచ్చే 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన వివరించారు. షాపుల కేటాయింపు ఈనెల 18వ తేదీన జిల్లా కలెక్టర్ ప్రకటించడం జరుగుతుందని జనార్దన్ రెడ్డి తెలిపారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతోపాటు రెండు లక్షల ఫీజు, ఆధార్ కార్డు, పాన్ కార్డు కాపీలను జత చేయాల్సి ఉంటుంది. గతంలో ఫీజు మొత్తంలో ఎనిమిదవ వంతు ఆరు వాయిదాల్లో చెల్లించడం జరిగేది. అయితే నూతన పాలసీ ప్రకారం ఫీజు చెల్లింపు ఎనిమిది వాయిదాలకు పెంచినట్లు సూపరింటెండెంట్ వివరించారు. బ్యాంక్ గ్యారెంటీని 50 శాతంకు తగ్గించారు. ఒక దరఖాస్తుదారుడు ఎన్ని షాపులకు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు... కానీ మొదటగా షాపు అలాట్మెంట్ అయిన తర్వాత మిగతా షాపులలో అతని దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు.
ఇవీ చూడండి: "హైదరాబాద్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి"