తెలంగాణ

telangana

ETV Bharat / city

సికింద్రాబాద్​ రైల్యే స్టేషన్​లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు - ప్రయాణికులు

ప్రయాణికుల రక్షణ భద్రతే ధ్యేయంగా రైల్వే స్టేషన్​లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పంద్రాగస్టు, బక్రీద్ సందర్భంగా ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో సోదాలు చేపట్టారు.

సికింద్రాబాద్​ రైల్యే స్టేషన్​లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

By

Published : Aug 13, 2019, 9:33 AM IST

రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులను సోదాలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు ప్లాట్ ఫారంలలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రయాణికులకు సూచించారు. రైల్వే స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.

సికింద్రాబాద్​ రైల్యే స్టేషన్​లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details