ఏపీ సీఎస్ నీలం సాహ్ని.. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని సీఎస్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సూచించారు.
సీఎస్ లేఖపై స్పందించిన ఏపీ ఎన్నికల సంఘం
ఏపీ సీఎస్ లేఖకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బదులు ఇచ్చారు. ఎస్‌ఎంఎస్ ద్వారా సీఎస్‌కు సమాధానం పంపారు. సీఎస్ లేఖ ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరచడమేనని చట్టవిరుద్దమని అన్నారు.
సీఎస్ లేఖపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
సీఎస్ లేఖకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బదులు ఇచ్చారు. ఎస్‌ఎంఎస్ ద్వారా సీఎస్‌కు సమాధానం పంపారు. సీఎస్ లేఖ ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరచడమేనని చట్టవిరుద్దమని అన్నారు.
సంబంధిత కథనం:ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు: ఈసీకి సీఎస్ లేఖ