Schools reopen in Delhi: దిల్లీలో వాయు కాలుష్యం కారణంగా దాదాపు నెల పాటు మూసివేసిన పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. 6వ తరగతి నుంచి పైతరగతులకు నేటి నుంచి భౌతిక తరగతులు పునఃప్రారంభించారు. దిల్లీలో గాలి నాణ్యత అంతకంతకూ పెరుగతున్న నేపథ్యంలో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం నవంబర్ 13న ప్రకటించింది.
డిసెంబరు 18 నుంచి 6వ తరగతి నుంచి పైతరగతులు పునఃప్రారంభించేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్(CAQM) శుక్రవారం అనుమతినిస్తూ ఉత్వర్తులు జారీ చేసింది. గాలి నాణ్యత కొంతవరకు మెరుగుపడిన నేపథ్యంలో.. పాఠశాలలు, కళాశాలలను దశలవారీగా పునఃప్రారంభించవలసిందిగా ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది.