ఒకటి.. రెండు కాదు.. నెలల తరబడి విద్యార్థులు ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తాటి బోదెలపై బిక్కుబిక్కుమంటూ నదిని దాటి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్నారు. ఇంకెన్నాళ్లు మాకీ అవస్థలని ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంకకు చెందిన విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు(students problems).
students problems: ఆ విద్యార్థులు పాఠశాలకు పోవాలంటే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే! - ఆ విద్యార్థులు నది దాటాలంటే.. తాటి బోదెలే వారధి
ఏపీలోని అవనిగడ్డ విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తాటి బోదెలపై బిక్కుబిక్కుమంటూ నదిని దాటి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్నారు. ఇటీవల కృష్ణా వరదలకు కొట్టుకుపోయిన మార్గాన్ని నిర్మించాలని అధికారులను కోరినప్పటికీ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇంకెన్నాళ్లు మాకీ అవస్థలని ప్రశ్నిస్తున్నారు.
నదీ గర్భ గ్రామమైన పాత ఎడ్లంక కాజ్‌వే మార్గానికి అనుసంధానంగా ఉన్న రహదారి ఇటీవల కృష్ణా వరదలకు కొట్టుకుపోయింది. తాత్కాలిక ప్రాతిపదికన అయినా రహదారి నిర్మించకపోవడంతో విద్యార్థులు, గ్రామస్థులు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. గ్రామం నుంచి అవనిగడ్డలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు రోజూ తాటి బోదెలపై భయంగా అడుగులు వేస్తూ నదిని దాటి వెళ్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి వరదలకు కొట్టుకుపోయిన మార్గాన్ని నిర్మించాలని కోరారు.
ఇదీ చదవండి:PET candidates protest in Hyderabad : 'ఏ కాలంలో ఉన్నాం? ఎందుకింత టైం పడుతోంది?'