కరోనా నివారణకు మాజీ ఎమ్మెల్యే రూ.25లక్షల విరాళం - ముఖ్యమంత్రికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చెక్కు అందజేత
కరోనా నివారణ కోసం తన వంతు సాయంగా... సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ రూ. 25 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.
కరోనా నివారణకు మాజీ ఎమ్మెల్యే రూ.25లక్షల విరాళం
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ... ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళమిచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ప్రగతి భవన్లో చెక్కు అందజేశారు. కరోనా నివారణకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా... తన వంతు సాయం చేసినట్టు తెలిపారు. ఆయన వెంట రాష్ట్రం ఆర్థికమంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.