ఆంధ్రప్రదేశ్ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1985 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మను కొత్త సీఎస్‌గా ఎంపిక చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ప్రణాళికా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా , ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్ గవర్నెన్సు సంస్థ వైస్ ఛైర్మన్, సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
AP CS: నూతన సీఎస్‌గా సమీర్ శర్మ నియామకం - ఏపీ తాజా వార్తలు
ఏపీ తదుపరి సీఎస్‌గా సమీర్ శర్మను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ప్రణాళికా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా , ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్ గవర్నెన్సు సంస్థ వైస్ ఛైర్మన్, సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
సీఎస్‌గా సమీర్
ఈనెల 30వ తేదీన ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉద్యోగ విరమణ చేయనున్నారు. జూన్ 30 తేదీనే ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా... కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆదిత్యనాథ్‌దాస్ సర్వీసును కేంద్రం సెప్టెంబర్ వరకు పొడిగించింది. అక్టోబర్ ఒకటో తేదీన కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి:Dalit Bandhu: దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలుపై సన్నాహక సమావేశం