Sajjala On Teachers demands: ఆర్థిక పరిస్థితి వల్ల ఫిట్‌మెంట్ ఎక్కువ ఇవ్వలేకపోయామని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నిన్ననే చెబితే ఉపాధ్యాయ సంఘాల సమస్యలు పరిష్కరించేవాళ్లమని వ్యాఖ్యానించారు. మినిట్స్ తయారయ్యాక బయటకు వెళ్లి మాట్లాడటం సరికాదన్నారు. ప్రభుత్వ పరిస్థితిని ఉద్యోగులు సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ఎవరూ కోరకున్నా ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచామని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ అన్నట్లు ప్రభుత్వం ఎక్కడా ఆధిపత్య ధోరణి చూపలేదని స్పష్టం చేశారు.
"హెచ్‌ఆర్‌ఏ వల్ల టీచర్లకు అన్యాయం జరిగిందని చెబితే సరిచేశాం. మినిట్స్ తయారయ్యాక బయటకు వెళ్లి మాట్లాడటం సరికాదు. ప్రభుత్వ పరిస్థితిని ఉద్యోగులు సహృదయంతో అర్థం చేసుకోవాలి. మిగిలిన సమస్యలనూ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 'చలో విజయవాడ'లోనూ ప్రభుత్వం ఉద్యోగులను ఏమీ అనలేదు. పవన్ అన్నట్లు ప్రభుత్వం ఎక్కడా ఆధిపత్య ధోరణి చూపలేదు"