తెలంగాణ

telangana

ETV Bharat / city

Sajjala On PRC GOs: 'పీఆర్సీ నివేదిక ఎందుకు.. తెలంగాణ కూాడా ఇవ్వలేదు' - sajjala on AP PRC

Sajjala On PRC GOs: కొత్త వేతన సవరణ ప్రకారం ఇప్పటికీ జీతాలు పడుతున్నందున... జీవోలు వెనక్కు తీసుకోవడం కుదరదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం తర్వాత మాట్లాడిన ఆయన... ఎవరికీ అన్యాయం చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. కొన్ని అంశాలపై సర్దుబాటు, మార్పులు చేసే అవకాశం ఉందన్నారు.

sajjalla on prc
sajjalla on prc

By

Published : Feb 1, 2022, 4:50 PM IST

Sajjala On PRC GOs: పీఆర్సీ జీవోలు, ఉద్యోగుల ఆందోళనపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ మైండ్​తోనే తాము చర్చలు చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు అన్యాయం చేయాలన్న ఉద్దేశం తమకు లేదని వెల్లడించారు. ఉద్యోగుల డిమాండ్లలో ఒకటి ఇక వర్తించదని స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త జీవో ప్రకారం.. వేతనాలు వారి ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు.

కొన్ని అంశాలను సర్దుబాటు, మార్పులు చేసే అవకాశం ఉందని సజ్జల చెప్పారు. ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం నుంచి ఏదో సాధించాలనే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఉద్యోగులను ఎవరూ బెదిరించడం లేదని సజ్జల స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదికను పదే పదే అడగడం ఎందుకని.. ఆ నివేదిక ఇస్తే అంతా అయిపోతుందా అని ప్రశ్నించారు. అసలు చర్చించాల్సిన అంశాలు వదిలేసి... దానిపైనే ఉద్యోగ సంఘాలు ఎందుకు పట్టుబడుతున్నాయో అర్థం కావడం లేదన్నారు.

"చర్చలు ప్రారంభమయ్యాయి.. ఇంకా ముందుకెళ్తాం. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీలు అనేవి ఏమీ లేవు. ఉద్యోగ సంఘాల నేతలు 3 డిమాండ్లను మా ముందుంచారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయడం భావ్యం కాదని చెప్పాం. కొత్త జీవో ప్రకారం ఇప్పటికే కొత్త వేతనాలు వేశాం. మేం ఓపెన్ మైండ్‌తోనే చర్చిస్తున్నాం. ఒత్తిడి తెచ్చి ఏదో సాధించాలని ప్రయత్నించడం సరికాదు. హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఉద్యోగులను ఎవరూ బెదిరించడం లేదు. పీఆర్సీ నివేదికపై అంత పట్టుదల ఎందుకు? పీఆర్సీ నివేదిక ఇస్తే సమస్య పరిష్కారం అయినట్లా. పీఆర్సీ నివేదికను తెలంగాణ కూడా ఇవ్వలేదు. పీఆర్సీ నివేదికను తెలంగాణ తర్వాత వెబ్‌సైట్‌లో పెట్టింది. అసలు విషయాలు వదిలి పీఆర్సీ నివేదికనే ఎందుకు కోరుతున్నారు.?" - సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:పసలేని బడ్జెట్.. గోల్‌మాల్‌ బడ్జెట్‌: సీఎం

ABOUT THE AUTHOR

...view details