తెలంగాణ

telangana

ETV Bharat / city

Saidabad incident: నిందితుడిని పోలి ఉండే చిత్రాలు విడుదల - సైదాబాద్

సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దాదాపు 500 మంది పోలీసులు నిందితుడు రాజు కోసం గాలిస్తున్నారు. మారు వేషాలతో తిరిగినా గుర్తించేందుకు వీలుగా నిందితుడిని పోలి ఉండే చిత్రాలను హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు.

Saidabad incident raju pictures
Saidabad incident raju pictures

By

Published : Sep 15, 2021, 10:17 PM IST

సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు కోసం దాదాపు 500 మంది పోలీసులు గాలిస్తున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు నిందితుడు మారు వేషాలతో తిరిగే అవకాశం ఉన్నందున, జుట్టు, గడ్డం వంటి మార్పులతో నిందితుడిని పోలి ఉండే చిత్రాలను హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు. నిందితుడ్ని పట్టించిన వారికి రూ.10లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 94906 16366 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌ పోలీసులు ఇంత మొత్తంలో రివార్డు ప్రకటించిన దాఖలాలు లేవు.

పోలీసులు తెలిపిన నిందితుడి ఆనవాళ్లివే...

* నిందితుడి పేరు: పల్లకొండ రాజు, వయస్సు 30 సంవత్సరాలు

* 5.9 అడుగుల ఎత్తు

* టోపీ పెట్టుకొని ఎర్ర చేతిరుమాల ముఖానికి పెట్టుకున్నాడు.

* రెండు చేతులపైనా మౌనిక అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఫ్యాంట్‌, షర్ట్‌ ధరించి ఉన్నాడు.

* మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పై ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాడు.

ఇదీ చూడండి:Saidabad Incident: చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలిచివేసింది: పవన్​కల్యాణ్​

ABOUT THE AUTHOR

...view details