Rythu bandhu On Fourth Day: రాష్ట్రంలో నాలుగో రోజు రైతుబంధు పథకం కింద అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేశారు. 6 లక్షల 75 వేల 824 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1144.64 కోట్ల రూపాయలు జమయ్యాయి. వీరితో కలిపి ఇప్పటి వరకు 52 లక్షల 71 వేల 91 మంది కర్షకులకు రైతుబంధు నిధులు అందినట్టైంది. మొత్తం పెట్టుబడి సాయం 4246.68 కోట్ల రూపాయల పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.
ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని మంత్రి ఆకాంక్షించారు. సంప్రదాయ సాగు నుంచి రైతులు బయటకు రావాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేందుకు ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.