తెలంగాణ

telangana

'ట్రాఫిక్​ నియమాలు పాటించటమే పోలీసులకు మనమిచ్చే గౌరవం'

By

Published : Nov 7, 2020, 9:14 AM IST

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్​ నక్లెస్​రోడ్డులో ట్రాఫిక్​ పోలీసుల వర్చువల్​ రన్​ ఫర్​ రోడ్​ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి మహమూద్​ అలీ... పోలీసుల సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.

run for road safty program in hyderabad nackles road
run for road safty program in hyderabad nackles road

'ట్రాఫిక్​ నియమాలు పాటించటమే పోలీసులకు ఇచ్చే గౌరవం'

ఎండనకా.. వాననకా.. అందరి భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్నారని హోంమంత్రి మహమూద్​ అలీ కొనియాడారు. ట్రాఫిక్ నియమాలు పాటించటమే వారికి మనమిచ్చే అసలైన గౌరవమని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నక్లెస్ రోడ్​లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వర్చువల్ రన్ ఫర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి... జెండా ఊపి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని... చిన్నపిల్లలకు తల్లిందండ్రులు వాహనాల ఇవ్వొద్దని కోరారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందని పేర్కొన్నారు. ఈ వర్చువల్ రన్​లో కమిషనరేట్ పరిధిలోని 50 ఠాణాల పోలీసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్​తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నగర శివార్లలో భారీ టౌన్‌షిప్‌ల నిర్మాణం..

ABOUT THE AUTHOR

...view details