తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉద్యోగ భద్రత విధివిధానాలు ఇవ్వాలి : ఆర్టీసీ టీఎంయూ - ఆర్టీసీ టీఎంయూ సమావేశం

ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతపై యాజమాన్యం గైడ్​లైన్స్​ ఇవ్వకపోవడం శోచనీయమని ఆర్టీసీ టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి ఆరోపించారు. సమ్మె తదనంతర పరిణామాలు, కరోనా పరిస్థుతుల్లో కార్మికుల సమస్యలపై కేంద్రం కమిటీ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.

rtc tmu central committee meeting in sundaraiah bhavan
ఆర్టీసీ టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశం

By

Published : Sep 27, 2020, 8:44 PM IST

ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భధ్రతపై సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ... యాజమాన్యం ఇప్పటి వరకు గైడ్​లైన్స్ ఇవ్వకపోవడం శోచనీయమని ఆర్టీసీ టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి ఆరోపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశానికి హాజరైన ఆయన... వందల మందిని డిపో స్పేర్ పేరిట ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలు, కరోనా పరిస్థితుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. టీఎంయూలో అధికార మార్పు అనేది లేదని... అశ్వత్థామరెడ్డి నాయకత్వానికి కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలిపినట్టు ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఆరు నెలల తర్వాత హైదరాబాద్​లో ఆర్టీసీ సేవలు

ABOUT THE AUTHOR

...view details