విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మోహన్‌భగవత్‌కు ఆలయ ఈవో సురేష్‌బాబు ఆహ్వానం పలికారు.
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ - దుర్గమ్మను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి మెుక్కులు చెల్లించుకొని.. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
ముఖ మండపం నుంచి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన పండితుల వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఈవో సురేష్‌బాబు మోహన్‌భగవత్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. రెండురోజులపాటు గుంటూరుజిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచారకుల భైఠక్‌లో పాల్గొనేందుకు మోహన్ భగవత్ శుక్రవారం విజయవాడ వచ్చారు.