తెలంగాణ

telangana

ETV Bharat / city

పొంగి పొర్లుతున్న జీడిమెట్ల ఫాక్స్​ సాగర్​ వరద కాలువ - jeedimetla news

హైదరాబాద్ లో గత రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. జీడిమెట్ల ఫాక్స్ సాగర్ వరద కాలువ పొంగడంతో ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో నీరు ప్రవహిస్తోందని.. రాకపోకలు నిలిచిపోయాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

road bundh due to overflow of fax sagar flood canal at jeedimetla
road bundh due to overflow of fax sagar flood canal at jeedimetla

By

Published : Sep 26, 2020, 1:48 PM IST

హైదరాబాద్ జీడిమెట్లలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఫాక్స్ సాగర్ వరద కాలువ పొంగి పొర్లుతోంది. పక్కనే ఉన్న ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో కి నీరు రావడం వల్ల ఆ కాలనీలోకి రాకపోకలు బంద్ అయ్యాయి. వర్షాకాలం వచ్చిందంటే చుట్టుపక్కల కాలనీలన్నీ జలమయం అవుతాయని స్థానికులు వాపోయారు.

కాలనీలోకి వెళ్లే బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బ్రిడ్జి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వెళ్లాలన్నా కష్టంగా ఉంటుందని.. అధికారులు పట్టించుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:ఎడతెరిపి లేని వర్షం.. తడిసి ముద్దైన భాగ్యనగరం

ABOUT THE AUTHOR

...view details